Wednesday, January 23, 2008
కొవ్వు
ఎవరైనా కొంచెం పొగరుగా మాట్లాడితే వీడికి కొవ్వెక్కువరా అని అనడం మనకి బాగా తెలుసు. ఆ కొవ్వునే ఇంగ్లీషులో కొలెస్ట్రాల్ అంటామని కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. పుట్టినప్పటి నుండి బక్కగా ఉండే నేను బహరైన్ వచ్చిన తరువాత బాగా బరువు పెరిగా. ఎంత అంటే దాదాపు 15 కేజీలు. తరువాత ఒక సారి ఇండియా వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ నన్ను చూసి వాళ్ళు భయపడి నన్ను భయపెట్టేసరికి అదేదో కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నా. అప్పుడు వచ్చిన రిజల్ట్ చూసి మా మమ్మీకి ఒకటే బెంగ పట్టుకుంది. ఎందుకంటే నార్మల్ గా 125 నుండి 200 వరకు ఈ కొలెస్ట్రాల్ అనబడే కొవ్వు ఉంటే మంచిదంట. మనకి అది కాస్తా 245 ఉంది. ఎవరికి మాత్రం భయమెయ్యదు?
అప్పుడు మా వాళ్ళకి ఏదోలా నచ్చజెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసా. అప్పటి నుండి వీలైనంత తక్కువ తింటూ కొంచెం డైట్ పాటిస్తుంటూ, బాగా కసరత్తులు చేస్తూ చివరికి ఈ రోజు మళ్ళీ ఆ టెస్ట్ ఏదో చేయించుకున్నా. ఆ రిజల్ట్ వచ్చేవరకూ పడిన టెన్షన్ నా ఏంసెట్ రిజల్ట్ కోసం కూడా పడుండను. ఎట్టకేలకు ఒక రెండు గంటల తరువాత అది వచ్చింది. చూడగానే ఒక్క సారి యాహూ అని అరవాలనిపించింది. కాకపోతే అది ఆఫీస్ అని ఆగిపోయా. ఇంతకీ అది ఎంత వచ్చిందో తెలుసా? 172. కేక కదా? మరి కాదేంటి? 245 నుండి 172 కి తగ్గిందంటే గొ్ప్పే కదా. అదే మరి. ఒప్పుకోండి. ప్లీజ్……….
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
hahaha..sathi nijamga great nuvvu..naaku 165 oo entho vundindi last month cheyinchukunte...245 too much nee ageki...take care
alaage akka. anyways, ee madhya konchem health-conscious gaane untunna le
good effort.. keep yourself active with exercise and also work for improving the good cholesterol to even it out.
Post a Comment