Wednesday, January 16, 2008

సంక్రాంతి


ఆంధ్రులకీ పండుగలకీ ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఏ పండుగైనా మన తెలుగువాళ్ళు జరుపుకునట్టు ఎవరూ జరుపుకోరేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. అందులో సంక్రాంతి ఒకటి. అసలు ఈ పండుగ పుట్టిందే తెలుగువాళ్ళ కోసం అనటంలో అతిసయొక్తి లేదు. కాని గత రెండు రోజులుగా నేను వింటున్నవి చూస్తుంటే ఇది నిజమేనా అనిపిస్తుంది. భోగి రోజు టీవిలో సంక్రాంతి గురించి ఏదో స్పెషల్ ప్రోగ్రాం వేసాడు. దాంట్లో క్షీణించి పోతున్న మన సాంప్రదాయాల గురించి చెబుతూ ఎవరైనా పోటీ పెట్టి బహుమతులు ఇస్తామంటే తప్ప అసలు ముగ్గులే కనపడటంలేదు అన్నాడు. వింటుంటేనే గుండె తరుక్కుపొయింది. దానికి తగ్గట్టు ఆ రోజు సాయంత్రం మా ఇంటికి ఫోన్ చేసి మా చెల్లిని పండుగ ఎలా జరుపుకున్నారు అని అడిగితే టీవిలో భోగి మంట చూసి జరుపుకున్నా అని చెప్పింది. ఇది చాలు మన పండుగలు మనవాళ్ళు ఎలా జరుపుకుంటున్నారో అర్ధం అవుతుంది.

ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు ఈ పండుగ ఎలా చేసుకునేవాళ్ళమో ఒక్కసారి అందరికీ చెప్పాలనిపిస్తుంది. సంక్రాంతి మూడు రోజులూ మా అమ్మమ్మవాళ్ళ ఇంటిలోనే గడిపేవాడిని. అసలు సంక్రాంతి అంటేనే చుట్టాలు కలుసుకునే పండుగ అనుకునేవాడిని చిన్నప్పుడు. అంతమంది కలిసేవారు. అమ్మమ్మవాళ్ళ ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. భోగి పండుగ ముందురోజు మరునాటి మంటకోసం చెక్కలు గట్రా పోగేసేవాళ్ళం. ఇంక భోగి పండుగ నాడు పొద్దుటే లేచి ఆ చలిలో వణుకుతూ భోగి మంట ముందు చేరేవాళ్ళం. తరువాతా ఏ వీధిలో పెద్ద మంట వేసారో అని బయల్దేరేవాళ్ళం. పెద్దవాళ్ళు భోగి మంటలో కాల్చమని వంకాయలు ఇచ్చేవాళ్ళు. కొంతసేపటికి స్నానపానాదులు కానిచ్చి ఊరి మీద పడేవాళ్ళం. ఎవరింటిలో భోగిపళ్ళు పోస్తున్నారో కనుక్కుని వాళ్ళింటిలో ప్రత్యక్షం అయ్యేవాళ్ళం. ఇంక ఆ రోజు స్పెషల్ వంటలు వంకాయ పచ్చడి, పచ్చి పులుసు. సాయంత్రాలు ఎలాగూ అరిసెలు, పాకుండలు ఉండనే ఉన్నాయ్. ఇంక ఆరోజు రాత్రి అయితే ఆడవాళ్ళ హడవుడి అంతా ఇంతా కాదు. పక్క వీధిలో ఎవరో రధం ముగ్గేస్తున్నారంట, పాతూర్లో ఎవరి ముగ్గులోనో రంగులు అదిరిపొయాయంట - ఇవి కబుర్లు. అప్పుడు వాళ్ళు వేసే పధకాలు జార్జ్ బుష్ వేసుంటే బిన్ లాడెన్ని ఎప్పుడో పట్టుకునుండేవాడు.

ఇంక అసలు పండుగ అనగా మకర సంక్రాంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొద్దుటే లేచి గుడికి వెళ్ళటం, కొత్త బట్టలు వేసుకుని మురిసిపోవటం, డూడూబసవన్నలని చూసి బయపడి పోవటం, చుట్టాలతో కలిసి సరదా సరదా ఆటలు ఆడుకోవటం - ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేనివి.

ఆఖరున వచ్చే కనుమ పండుగకి స్పెషల్ గారెలు,కోడి కూర. ఆ రోజు ఖచ్చితంగా మాంసం తినాలని ఎవరు నియమం పెట్టారో గాని ఇప్పటికీ చాలామంది బుద్ధిగా పాటిస్తారు.

ఈ మూడు పండుగలు అయిపోగానే మా నాన్నమ్మగారింటికి ప్రయాణం. ఎందుకంటే కనుమ పండుగ అయిపోయిన రెండో రోజున అక్కడ ప్రభల తీర్ధం పెడతారు. చుట్టుపక్కల ప్రతి ఊరినుండి ఒక్కో ప్రభ వచ్చేది. బాగా అలంకరించిన ప్రభకి, అన్నిటికన్నా పెద్ద ప్రభకి బహుమతులు ఉండేవి. ఆ తీర్ధానికి జట్లుజట్లుగా వెళ్ళేవాళ్ళం. అక్కడ బోల్డన్ని బొమ్మలు కొనుక్కుని, కోది పకోడి, పుల్లైసు గట్రా తినేసి చీకటి పడేవేళకు ఇంటికి చేరేవాళ్ళం.

ఇవన్నీ తల్చుకుంటే మనసులో ఒక తీయటి భావన....
నేటి పరిస్థితి చూస్తుంటే గుండెలో ఒక అరణ్య రోదన..........

8 comments:

Usha said...

నమస్తే సతీష్ గారు ఇపుడే మీ బ్లాగు చదివేను అది సంక్రాంతి ఇంకా ధోకా చదివేకా కామెంటు రాయకుండా ఉండలేకపోయాను
నిజమండి మన చిన్నప్పటి రోజులు ఈకాలం పిల్లలకి కలలో కుడా దొరకవు భోగి దండ ఎవరిదీ పెద్దదా అని పోటి ఇంకా ఆ నలుగు స్నానం చలిలో ఒహ్ ఎన్ని గురుతులో కదా
చాలా చక్కగా వర్ణించారు
Thanks
Usha
http://usha-poetry.blogspot.com/

Satish Bolla said...

ఉషగారు, నా బ్లాగులో కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు. ఇందులో నేను గొప్పగా రాసింది ఏమీ లేదు. కాని గతాన్ని, వర్తమానాన్ని పోల్చి చూస్తే చాలా భాద పడి ఆ బాధనే నా బ్లాగులో పెట్టాను. అంతే

Usha said...

కాదు సతీష్ నిజంగా మనకి ఉన్నా ఈ తీపి గురుతులు [మీ వయసు నాకు తెలీదు] ఈ కాలపు వాళ్ళకి లేవు అవన్ని చాలా మధురాలు
ఒక్కటి చెప్పండి ఆరోజుల్లో "రావోయి చందమామ " ,"వెన్నెల రేయి " "చల్లని రాజా ఒ చందమామ " లాంటి పాటలు ఇప్పటికి ఆ పాత మధురాలు గానే చెప్పబడుతున్నాయి
మరి అలా చెప్పుకోడానికి గత 15 సంవత్సరాలుగా ఒక్క పాట ఉందా ?
అలాగే ఈ మధురాలును అవునా కాదా ?

Apple said...

Baavundi Sathi mee Godavari Jilla Sankranthi...konchem atoo itooga memoo ilaane chesukuntaamu...Maa intlo ippatikee ee mugguloo, bhogi mantalu, bhogi pallu, pedda vallaki poojalu ilanti vaatithone jaruguthundi...ee year miss ayinanduku nenu padda badha antha inthaa kaadu :(...

Satish Bolla said...

@usha garu....
asalu ee rojullo vasthunna paatalni alanaati aa"paatha" madhuraaltho polchakandi. enni saarlu vinnaa, alanaati paatalu ippatike aahladam kalisthaai.
inka naa age antaara? nenemi maree musali vaadini kaahdulendi. jus 25 yella musalivaadini.

@apple....
entha adrustavanthuraalivi??? nuvvu ee year miss ainaa gaani malle eppatikainaa vaatine andhukune chance undhi. but maaku alaa kaadhu gaa

Sree said...

telugu scriptlo chimpesav kada.. belated wishes :)

Satish Bolla said...

@sush
ayya baaboi, champadaalu, narukkovadaalu maa intaa-vanta levu. thanx for the wishes and same to u

Usha said...

Helo Satish gde.[:)]
chaalaa rojulaki meecoment chudagaligaa
Thanks andi yaa naaku anipistundi but enthayinaa kotta kadaa raayalanna tapana lo elaa raayaalo pattu kudarataaniki time padutundemo kadaaa.

Thanks
Usha