Tuesday, October 30, 2007

నీ తలపులు

పాలుగారే పాపాయిలు
గుర్తుచేస్తారు నువ్వింకా నాతోనే ఉన్నావని
నిర్మలమైన నీలాకాశం
గుర్తుకుతెస్తుంది మన పరిచయం మచ్చలేనిదని
చల్లని పండు వెన్నెల
గుర్తుచేస్తుంది నీ తలపులు నను వీడిపోలెదని
గలగల పారే సెలయేరు
గుర్తుచెస్తుంది నీ అందెల సవ్వడి నా గుండెలోనే పొదిగి ఉన్నదని
దూరాన కూసే కోయిల
గుర్తుచేస్తుంది నీ మధురభాషణలు నా మదిలో మారుమోగుతున్నాయని
ప్రియా, ఎందుకు నను వీడిపొవు?
లేక కలలోనైనా ఓసారి కనిపించవూ?

No comments: