మొన్న ఒక సారి నా ఫ్రెండు ఒకమ్మాయికి ఫొన్ చేసినప్పుడు ఏవో మాటల మధ్య “నా మెయిల్ ఆఫీస్ లో ఎవరూ లేనప్పుడు చదువ్. లేక పొతే కంపు వచ్చి చస్తారు” అన్నా. దానికి తను విరగ బడి నవ్వేసి “మీరు ఇంక ఆ కుళ్ళు జోకులు ఆపరా?” అంది(ఏదో నవ్వు రానట్టు). ఆవతలి వాళ్ళు అలా నవ్వుతుంటే మనమెలా ఆపుతాం? అప్పుడే సరదాగా ఈ బ్లాగులో కుళ్ళు జోకుల గురించి రాద్దాం అనుకున్నా.
నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు కొందరు. కాని అదే నవ్వు నలభయ్ విధాల మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు. మనం నవ్వామా లేదా అన్నాది ముఖ్యం గాని ఎలా నవ్వు వచ్చింది అన్నాది ముఖ్యం కాదు. నవ్వటం ఒక కళ ఏమో గాని నవ్వించడం అంత కంటే పెద్ద కళ. ఏ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది “కుళ్ళు జోకులు”. నన్నడిగితే ఇవి వెయ్యడానికి ఎంత టాలెంట్ కావాలో ఒక్కో సారి ఇవి మనసారా ఆస్వాదించడానికి కూడా అంతే టాలెంట్ కావాలి.
ఆసలు ఈ కుళ్ళు జోకులంటే ఏమిటి? కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం కలిపి వేసే జోకులు కొన్ని ఉంటాయి. ఇవి వేసినప్పుడు కొంచెం కంపు వస్తాయి గనక వీటిని కుళ్ళు జోకులని అంటారు. అవతలి వాళ్ళు ఇందులో ఉన్న సున్నితమైన హాస్యాన్ని గుర్తిస్తే పర్లేదు. కాని వ్యంగ్యాన్ని పట్టించుకుంటే మాత్రం గొడవలు ఐపొతాయి. అందుకే వీటికి సమయం, సందర్భం(టైమింగ్) చాలా ముఖ్యం. ఇవి వెయ్యటానికి కావల్సిన లక్షణాలు
1. కొంచెం చతురత
2. కొంచెం వ్యంగ్యం
3. కొంచెం టైమింగ్
4. కొంచెం లోకజ్ఞ్యానం ….. మొదలైనవి
ఇప్పుడు మచ్చుకి కొంచెం కుళ్ళు కంపుని ఆస్వాదిద్దాం….. అదేనండి, కొన్ని కుళ్ళు జోకులు వేసుకుందాం.
1. మొన్నో రోజు జిం లో ఏవో మాటల మధ్య మా కోచ్ “Enjoy sir. Today is your day” అన్నాడు. దానికి నేను అదోల మొహం పెట్టి “what is this, sir? I thought today’s Thursday, right?” అన్నా. పాపం, అప్పుడు చూడాలి అతని మొహం…..
2. మా ఆఫీస్ లో ఒకాయన పచ్చి శాఖాహారి. ఏవో మాటల మధ్య నన్ను కూడా మాంసాహారం మానెయ్యమన్నాడు. కొన్ని రోజుల తరువాత మానేసావా అని అడిగాడు. దానికి నేను “మానేసాను సార్. నిన్న రాత్ర్రి నుండి తినలేదు” అన్నా. గురూగారు మళ్ళీ నాకు ఏమన్నా సలహా ఇస్తే ఒట్టు.
3. క్రితం వారం తెలుగు కళా సమితి లో ఏదో ప్రొగ్రాం ఉందని వెళ్ళాం. వచ్చేటప్పుడు ఇంకొకతన్ని మాతో రమ్మన్నాం. తను నడిచి వెల్లిపొతాను అన్నడు. అప్పుడు మావాడొకడు “పర్లేదు సార్, వచ్చెయ్యండి. డిక్కీ ఖాళీయే” అన్నాడు.
పైన చెప్పినవి ఏవీ పెద్ద సూపర్ జోకులేమీ కాదు. అయినా అవి వేసే టైమింగ్ ని బట్టి అద్బుతం గా పేలతాయి. అందుకే కుళ్ళు జోకులు అమర్ రహే!!!!!!!
Sunday, October 21, 2007
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
నవ్వడం అదృష్టం.
నవ్వించగలగటం వరం.
............... మిగిలిన కథ నా బ్లాగులో దర్శింగలరు. (కంగారు పడొద్దు ) మీ బ్లాగు ని పెద్ద జోకులు పేలతాయన్న ఆశతో చూశాను.
పర్లేదు. కానీ ఎందుకో మీరు ఇంతకంటే బాగా నవ్వించగలరేమోనని అనిపించింది.
గట్టిగా గాలేస్తే నవ్వేసే నాకు మీ జోకుల్లో చిరుగాలి కొద్దిపాటి గిలిగింతలు పెట్తింది.
ఆ చిరుగాలి ఇంకా బాగా విజృంభించి అందరినీ అలరించాలని ఆశిస్తూ.....తెలుగుకళ -..........పద్మకళ.
www.telugukala.blogspot.com
A Hearty Welcome.....
pl.visit
పద్మకళగారు, నా బ్లాగుని దర్శించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని పూర్తిగా సంతోషింపజేయనందుకు మన్నించవలెను. మీ మనసుకి నచ్చే మాంచి ఆర్టికిల్ తో త్వరలోనే మీ ముందుంటా.
Post a Comment