
సృష్టిలో దాదాపు ప్రతి బంధానికీ ఒక అర్ధం ఉంది. తల్లీ బిడ్డల మధ్య పేగు బంధం. దంపతుల మధ్య దాంపత్య బంధం. ఇలా దాదాపు అన్నిటికీ అర్ధముంది. ఒక్క స్నేహానికి తప్ప! ఏదీ ఆశించనిదే స్నేహం. మన ప్రేమని కొంత మందికే పంచగలం. కాని స్నేహం వీటన్నిటికీ అతీతం. "ఒక మనిషి గుణాన్ని అతని స్నేహితులని బట్టి అంచనా వెయ్యొచ్చు" - ఈ మాట ఏ మహానుభావుడన్నాడో గుర్తులేదుకాని ఇది అక్షరసత్యం.
మన గురించి మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ తెలిసింది కేవలం మన స్నేహితులకే. మనకి సంతోషం కలిగితే దానిని అందరితోనూ పంచుకుంటాం. కాని బాధ కలిగితే మాత్రం మనం అశ్రయించేది స్నేహితులనే. మన తల్లిదండ్రులతో చెప్పుకోలేని ఎన్నో విషయాలు మనం స్నేహితులతో పంచుకుంటాం. చిన్నప్పుడు దొంగతనంగా జామ చెట్టు ఎక్కినా, పెద్దయ్యాక ఎవరికీ తెలీకుండా సిగరెట్లు కాల్చినా.... మనం ఆధారపడేది స్నేహితులపైనే.
అందుకే ఒక సినీకవి అన్నట్టు "స్నేహానికన్న మిన్న లోకాన లేదురా"..........
Happy Friendship Day
1 comment:
Hey super satish.Chala baga rasavu
Post a Comment