Sunday, March 11, 2007
స్నేహితుడు
మనసేమో మరపురాని మగువ కోసం మూగబోతే
తనువేమో తిరిగిరాని తన కోసం తపనపడితే
గుండెలో గూడు కట్టుకున్న గోడు నరనరాన్ని తొలిచివేస్తుంటే
నా జగమంతా కారుచీకట్లు కమ్ముకుంటే
ఆ చీకట్లొ ఒక చిన్ని కాంతికిరణం
"ఇంతింతై వటుడింతై" అన్నట్టు దాని ప్రకాశం
పెరిగి నా లోకమంతా వెలుగుతో నింపగా
ఆ కిరణానికి కారణం నేను వెతుకుతుండగా
ఆ వెలుగులో కనిపించావు నువ్వు నవ్వుతూ
"భయపడకు మిత్రమా, నేనున్నాను" అంటూ
నూరిపోసావు ధైర్యాన్ని
చూపించావు నా గమ్యాన్ని
అందుకే మిత్రమా, నువ్వుండేది దూరదేశమైనా
నీ చిరునామా మాత్రం నా గుండెలోన
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Really nice poetry, Satish. I enjoyed reading your blog posts. Will keep coming back!
thanx a lot, deepthi. will keep looking for ur comments
Post a Comment