Wednesday, February 14, 2007

కాని ఇప్పుడు(ఇది కధ కాదు, కవిత అంత కన్నా కాదు)......

నా చిన్నప్పుడు స్కూల్ అంటే పగలంతా చదువులు, మధ్యాన్నం ఆటలు
కాని ఇప్పుడు స్కూల్ అంటే బుర్రకే చదువులు కాని శరీరానికి కాదు
నా చిన్నప్పుడు పండుగంటే బందువులందరూ కలుసుకునే రోజు
కాని ఇప్పుడు పండుగంటే హొటల్ భోజనాలు, మొబైల్ పలకరింపులు
నా చిన్నప్పుడు సెలవలంటే కొతి-కొమ్మచ్చిలు, దొంగ-పొలీసులు
కాని ఇప్పుడు సెలవలంటే ప్లే-స్టేషన్లు,కార్టూన్ నెట్వర్క్లు
నా చిన్నప్పుడు ఆకలి వెస్తే ఇంటిలొ పెట్టేవి జంతికలు, చగోడీలు
కాని ఇప్పుడు ఆకలి వెస్తే ఫొన్ చేసి తెప్పించేవి పిజ్జాలు, బర్గర్లు
నా చిన్నప్పుడు నిద్ర రావటానికి మందు తాతయ్య కథలు
కాని ఇప్పుడు నిద్ర రావటానికి మందు ఒక గంట టీవి

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తేడాలు.........
మళ్ళి తిరిగివస్తాయా ఆ రొజులు.......

వీడేమిటి, ముసలాడిలా ఉన్నాడు అనుకుంటున్నారా? నా వయసు 24 మాత్రమే. ఇప్పుడు చెప్పండి, ఇంత తక్కువ కాలంలొనే జనంలో ఇంత మార్పు ఎలా వచ్చింది?

No comments: