Monday, May 21, 2007

తలపులు

తొలకరి జల్లు కురవగానే పరిమళిస్తుంది పుడమి గర్భం
నా చెలి తలపు రాగానే పులకరిస్తుంది నా చిన్ని హ్రుదయం

భానుడు ఉదయిస్తాడు నింగిలో
తన రూపు వికసిస్తుంది నా మదిలో

పక్షులు విహరిస్తాయి గగనంలో
నా మనసు విహరిస్తుంది తన ఊహల్లో


మీనాల్లాంటి ఆ కనులు
నా హ్రుదయాన్ని కొల్లగొట్టు పూల బాణాలు
సంపంగిలాంటి తన నాసిక
నా హ్రుదయసామ్రాజ్ఞ దీపిక
తన అధరాలు
వికసించే రుధిరవర్ణపు గులాబీలు
ఆ వదనం
పౌర్ణమి చంద్రబింభం
సృష్ఠి అంతా తానే ఐనప్పుడు
తను తప్ప మిగతా ప్రపంచమంతా నాకు వట్టి భ్రమ
అందుకే ఎప్పటికీ తనే నా ప్రియతమ