Wednesday, November 29, 2006

నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నిన్ను
నీ ప్రేమ దొరకగానే అందినట్టయ్యింది నాకు మిన్ను
నీవే నా లోకంగా
నీ ఆనందమే నా ఆశయంగా
బ్రతికాను ఇన్నాళ్ళు
కాని చివరకు మిగిల్చావు కన్నీళ్ళు
మౌనమే భాషగా
ఏకాంతమే తోడుగా
వెళ్ళదీస్తున్నాను కాలం
గుండెలొ రోజూ ఏదో కలకలం
ఐనా ఆపను ఈ నిరీక్షణ
ఎన్నాళ్ళైనా నీ ప్రేమకై సాగిస్తూనే ఉంటాను అన్వేషణ

Sunday, November 26, 2006


ఉదయించే సూర్యుణ్ణి చూడటం కొందరికిష్టం
కాని నా చెలి మోము చూడటమే నాకిష్టం
వికసించే పువ్వుని చూడటం కొందరికిష్టం
కాని ఆ పువ్వుకన్నా నా చెలి నవ్వే నాకిష్టం
పక్షుల కిలకిలలంటే కొందరికిష్టం
కాని నా చెలి గుర్తొచ్చినపుడు నా గుండె చేసే గుసగుసలే నాకిష్టం
సెలయేరులొ చేపల్ని చూడటం కొందరికిష్టం
కాని ఆ మీనాలకంటే నా చెలి నయనాలే నాకిష్టం
మయూరి నడకంటే కొందరికిష్టం
కాని నా చెలి వేసే ప్రతి అడుగూ నాకిష్టం
నా చెలికి కూడా నేనంటే చాలా ఇష్టం
కాని మమ్మల్ని కలపటం ఆ ప్రకృతికి కూడా కష్టం

Monday, November 06, 2006

విద్యా
నువ్వు లేని ఈ లోకం నాకో మిధ్య
గతమెంతో ఘనమన్నట్టు
నీ గురుతులతొనే రోజులు సాగదీస్తున్నాను
గలగల పారే గోదారిలా
నీ తలపులు నాలో కదులుతున్నవి
అంతెరగని కడలి కెరటాల్లా
నీ అందెల సవ్వళ్ళు నను మైమరిపిస్తున్నవి
కూటి కోసం తిరిగి తిరిగి మరల గూటికి చేరే గువ్వల్లా
ఏ ఆలోచనలతో ఉన్నా మరల మనసు నీ జ్య్నాపకాలకే తిరిగి వస్తుంది
నింగిలో తారలెన్ని ఉన్నా సూర్యునికే ప్రకాశం ఎక్కువ
లోకంలో తరుణిలెందరు ఉన్నా నీవంటేనే నాకు మక్కువ